14-01-2026 02:29:28 AM
ప్రారంభించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం
బస్తీవాసులతో వేడుకల్లో పాల్గొన్న హైడ్రా కమిషనర్, వీహెచ్ హనుమంతరావు
సికింద్రాబాద్ జనవరి 13 (విజయ క్రాంతి): నగరంలోని పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ పతంగుల, మిఠాయిల పండుగ (ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్) మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. శతాబ్దాల చరిత్ర కలిగిన పతంగుల పండుగ మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు.
అనంతరం వివిధ రాష్ట్రా ల మిఠాయిల స్టాళ్లను మంత్రులు సందర్శిం చి రుచులను ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎండీ క్రాంతి వల్లూరి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహ రెడ్డి, హెరిటేజ్ డైరెక్టర్ అర్జున్ రావు, కైట్ ఫెస్టివల్ కన్సల్టెంట్ పవన్ డి సోలంకి, క్లిక్ ప్రతినిధులు లింబీ బెంజిమన్, పరమానంద శర్మ, అభిజిత్ తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మకుంటలో ఎగిరిన పతంగులు
అంబరపేటలోని బతుకమ్మకుంటలో ఎగిరిన పతంగులు ఇంద్రధనుస్సు తలపించాయి. ఒకదానితో ఒకటి పోటీ పడి నింగి వైపు దూసుకెళ్లిన పతంగులను చూసి పిల్లలు కేరింతలు కొట్టారు. బతుకమ్మకుంట చెంత స్థానికులు ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, పార్లమెంట్ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంత రావుతో కలసి హైడ్రా కమిషనర్ గాలిపటాలు ఎగురవేసి ప్రారంభించారు.
దీంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఆక్రమణలు తొలగించి హైడ్రా రూపొందించిన బతుకమ్మ కుంటతో ఇక్కడ వాతావరణం మారిపోయిందని చెబుతూ స్థానికులు మిఠాయిలు తినిపించుకున్నారు. బతుకమ్మ కుంటాను అభివృద్ధి చేసిన ప్రభుత్వానికి, హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు.
సౌకర్యాలు పెంచుతాం..
చెరువు చెంత మహిళలు, చిన్నారులు వినియోగించేలా వ్యాయామ పరికరాలను సమ కూర్చుతామని హైడ్రా కమిషనర్‌ఏవీ రంగనాథ్ తెలిపారు. తెలంగాణ ఫిషరీస్ డెవలప్మెం ట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, తిరుమల్, ఉమామహేశ్వర రావు, ఇన్స్పెక్టర్ బాలగోపాల్, తదితరులు పాల్గొన్నారు.