కిట్స్ సివిల్ విద్యార్థినికి ‘గేట్’లో ఆలిండియా ర్యాంక్
కోదాడ, మార్చి 20 : స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థినికి అప్పన్న ఉషారాణి 2026వ సంవత్సరం ప్రకటించిన పలితాలలో ఆలిండియా గేట్ జాతీయ స్థాయి పరీక్ష లో 7,106 ర్యాంక్ సాధించింది.
ఈ ర్యాంక్ ద్వారా జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు అయినటువంటి ఐఐటీ, ఎన్‌ఐటి వంటి విద్యాసంస్థలో ఎంటెక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్య పూర్తి చేయుటకు అర్హత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ శుక్రవారం తెలిపారు. ఈ జాతీయ స్థాయి పరీక్ష అయిన గేట్ లో ర్యాంక్ సాధించిన విద్యార్థిని ని కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పెరుమాళ్ళ పల్లి గాంధీ, కళాశాల డైరెక్టర్ నాగారర్జునరావు గారు మరియు విభాగాధిపతి లక్ష్మణ్ సివిల్ అధ్యాపక సిబ్బంది, అభినందించారు.




