4 August, 2026 | 7:10 AM

తిరుమలలో 3 కిలోమీటర్ల క్యూ

20-05-2024 02:38 AM

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి) :  ఏపీలోని తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు ఆదివారం 3 కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. స్వామివారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు రావడంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. రింగురోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు 3 కిలోమీటర్ల వరకు భక్తులు బారులుదీరారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు ప్రకటించారు.