తొలి అంతరిక్ష పర్యాటకుడు మనోడే
రికార్డు సృష్టించిన గోపీచంద్ తోటకూర
విజయవంతంగా రోదసీలోకి వెళ్లి తిరిగొచ్చని గోపీ
న్యూయార్క్, మే 19: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ చేపట్టిన అంతరిక్ష ప్రయోగం విజయవంతమైంది.అంతరిక్ష పర్యాటకంలో మన తెలుగు వ్యక్తి చెరగని ముద్ర వేశాడు. బ్లూ ఆరిజిన్ సంస్థ చేపట్టిన పర్యాటక అంతరిక్ష నౌక న్యూ షెపర్డ్ ఆయన అంతరిక్షంలోకి వెళ్లాడు. అమెరికాలోని టెక్సాస్ నుంచి ఈ నౌక అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. మొత్తం ఈ అంతరిక్ష నౌకలో ఆరుగురు అంతరిక్షంలోకి వెళ్లారు. అక్కడికి చేరుకున్న తర్వాత వారంతా కొద్దిసేపు భారరహిత స్థితిని పొందారు.
అనంతరం క్యాప్సూల్‌లో విజయవంతంగా తిరిగి భూమికి చేరుకున్నారు. దీంతో టూరిజం రాకెట్‌లో రోదసీలోకి వెళ్లి వచ్చిన తొలి భారతీయుడిగా గోపీచంద్ తోటకూర రికార్డు నెలకొల్పారు. ఏపీలోని విజయవాడకు చెందిన గోపీచంద్ తోటకూర పైలట్‌గా ఆయన తన ప్రస్థానం ప్రారంభించారు. ఆయన ప్రిజర్వ్ లైఫ్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు. కాగా, గోపీ చంద్‌తో పాటు వ్యోమగామి ఎడ్ డ్వైట్ 90 ఏళ్ల వయసులో ఈ రాకెట్‌లో ప్రయాణించారు. అలాగే వెంచర్ క్యాపిటలిస్టు మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ బిజినెస్‌మ్యాన్ సిల్వైన్ చిర్నో, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్ షాలర్ ఈ రాకెట్‌లో ప్రయాణించారు.






