కోల్‌కథ ఏమౌతుందో?
ముంబైతో కోల్‌కతా పోరు
గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు
కోల్‌కతా, మే 19 : ఐపీఎల్ 19వ సీజన్‌లో మూడు ప్లే ఆఫ్ బెర్తులు ఖాయమైపోగా ఇక ఒక్కటే మిగిలి ఉంది. ఆ ఒక్క బెర్త్ కోసం ఐదు జట్లు పోటీ పడుతుండగా.. రేసులో కోల్ కతా నైట్ రైడర్స్ కూడా నిలిచింది. ఈ సీజన్‌లో పడుతూ లేస్తూ సాగిన కేకేఆర్ ప్రస్తు తం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.
ఇప్పటి వరకూ 12 మ్యాచ్‌లలో ఐదే గెలిచిన ఆ జట్టు ఖాతాలో 11 పాయింట్లు ఉన్నాయి. మిగిలిన రెండు మ్యాచ్ లలో గెలిస్తే ఇతర జట్ల ఫలితాలు అనుకూలిస్తే కోల్ కతా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. గత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై విజయం ఆ జట్టు కాన్ఫిడెన్స్‌ను బాగా పెంచింది. ఫిన్ అలెన్, రఘువంశీ, కామెరూన్ గ్రీన్ సూపర్ ఫామ్‌లోకి వచ్చేశారు.
ఈ త్రయం చెలరేగి ఆడడంతో కేకేఆర్ అద్భుత విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రహానే ఫామ్ లో లేకున్నా మిగిలిన వారు రాణిస్తుండడంతో కోల్ కతాకు బ్యాటింగ్ పరంగా పెద్ద ఇబ్బం దేమీ లేదు. బౌలింగ్‌లోనూ ఆ జట్టు నిలకడగా రాణిస్తోంది. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తమ స్పిన్ మ్యాజిక్ చూపిస్తుండగా.. పేస్ విభాగంలో సౌరభ్ దూబే, ముజర్బానీ బరి లోకి దిగనున్నారు.
గ్రీన్ కూడా మిడిల్ ఓవర్ల లో వికెట్లు తీస్తుండడం అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు. మరోవైపు ఇప్పటికే సీజన్ నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ పరువు కోసం పోరాడుతోంది. గత మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌ను ఓడించడం ముంబైకి కాస్త ఊరటని చ్చింది. ఇప్పటి వరకూ 12 మ్యాచ్‌లు ఆడిన ముంబై నాలుగింటిలో గెలిచి 8 మ్యాచ్‌లలో పరాజయం పాలైంది. మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ గెలిచి సీజన్‌ను గౌరవప్రదంగా ముగించాలని భావిస్తోంది. పంజాబ్ కింగ్స్ పై భారీ టార్గెట్‌ను అలవోకగా ఛేదించింది.
రికెల్ట్టన్, తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌లతో అదరగొట్టారు. అయితే సూర్యకుమార్ యాద వ్ పేలవ ఫామ్ ముంబైకి ఇబ్బందిగా మారింది. ఈ సీజన్‌లో సూర్య ఒక్క చెప్పకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. గత మ్యాచ్‌కు దూరమైన హార్థిక్ పాండ్యా , సూర్యకుమార్ కోల్‌కతాపై బరిలోకి దిగనున్నారు. పాండ్యా కూడా తనదై న మెరుపులు మెరిపించి చాలారోజులైంది. అటు బౌలింగ్ లో బుమ్రా, ఘజన్ ఫర్, శార్థూల్ ఠాకూర్, దీపక్ చాహర్ లపై అంచ నాలున్నాయి. గత రికార్డులను చూస్తే ముంబైదే పైచేయిగా ఉంది.
తుది జట్లు అంచనా
కోల్‌కతా: రహానే (కెప్టెన్), రఘువంశీ, గ్రీన్ , మనీశ్ పాండే, రింకూ సింగ్, నరైన్, అంకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, సౌరవ్ దూబే, కార్తీక్ త్యాగి, ముజర్బానీ
ముంబై: రికెల్టన్, రోహిత్ శర్మ, నమన్ ధీర్, సూర్యకుమార్, తిలక్ వర్మ, విల్ జాక్స్ , హార్థిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ చాహర్, శార్థూల్ ఠాకూర్, ఘజన్‌ఫర్, బుమ్రా, రఘు శర్మ






