28 August, 2026 | 5:19 AM

జిల్లా ఎస్పీకి రాఖీ కట్టి, మిఠాయి తినిపించిన విద్యార్థినులు

28-08-2026 12:05 AM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): రక్షాబంధన్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో సరస్వతి శిశు మందిర్ విద్యార్థినులు, బ్రహ్మకుమారీస్ సభ్యులు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్ కవిత జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీకి మిఠాయి తినిపించి తమ ఆప్యాయతను చాటుకున్నారు. అదేవిధంగా దాబా బి గ్రామంలో నిర్వహించిన ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో పాల్గొన్న ఇచ్చోడ విద్యాలయ పాఠశాల విద్యార్థులు డ్రగ్స్, రోడ్డు భద్రతపై చక్కటి కళా ప్రదర్శన నిర్వహించి అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా ఎస్పీకి రాఖీ కట్టి, తమకు రక్షగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి మహిళ, బాలికకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులు, విద్యార్థినులు ధైర్యంగా ఉండి చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.