10 August, 2026 | 5:46 PM

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను పక్కన పెట్టింది

19-06-2024 03:28 PM

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక ప్రత్యేక పరిస్థితులు చూస్తున్నామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్ బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.... కేసీఆర్ మార్కు లేకుండా చేస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి హామీలు పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.