మంత్రి కొండా సురేఖ ప్రోటోకాల్ వివాదం.. పర్యటన రద్దు
19-06-2024 03:32 PM
మెదక్ : జిల్లాలోని కొల్చారంలో దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం పర్యటించారు. మంత్రి పర్యటనలో ప్రోటోకాల్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య వివాదం నెలకొంది. నియోజకవర్గంలో ఎలాంటి అధికారం లేనివారు కూడా వేదికపై ఉన్నారని ఎంఎల్ఎ సునీతారెడ్డి ప్రశ్నించారు. వేదికపై అధికారులను ఎందుకు ఆహ్వానించలేదని స్థానిక ఎంపీటీసీని నిలదీశారు. దీంతో మంత్రి కొండా సురేఖ కార్యక్రమాన్ని మధ్యలోనే రద్దు చేసుకొని వెనుదిరిగారు.






