4 August, 2026 | 2:49 AM

అబద్ధాలకు కేరాఫ్ కేటీఆర్

04-08-2026 01:04 AM

ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ కే టీఆర్ అని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శించారు. ‘ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి నిం డు సభలో మీ నాన్న కేసీఆర్ మాట్లాడింది మర్చిపోయావా కేటీఆర్.. 370 ఇంజనీరిం గ్ విద్యాసంస్థలు అవసరమా అన్నది కేసీఆర్ కాదా? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానిస్టేబుల్ ఉధ్యోగాలకు దరఖాస్తు పెట్టుకుంటున్నారు అని అవహేళన చేసింది కేసీఆర్ కాదా? నేను గోడల పై రాతలు రాసానని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. కొత్తగా నువ్వేంది చెప్పేది కేటీఆర్’ అని ప్రశ్నించారు.

‘నువ్వు 119 ఎమ్మెల్యేలలో ఒక్కడివి, సీఎం గురించి మాట్లాడే స్థాయి కాదు’ అని అన్నారు. కేటీఆర్ మా ట్లాడే ముందు డ్రింకింగ్ టెస్టు చే యాలన్నారు. గ్రూప్ 1, డీఏస్సీ వేయలేని మీరు ఉద్యోగాల గురించి మాట్లాడుతారా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను, రైతులను కనీసం మనుషులుగా కూడా చూడాలేదని విమర్శించారు. కేటీఆర్ ఇదే నీకు ఎన్నిక అని, మాజీ అవ్వ డం ఖాయమని జోస్యం చెప్పారు.