4 August, 2026 | 2:51 AM

మక్కల అమ్మకాల్లో మార్క్‌ఫెడ్ చరిత్ర

04-08-2026 01:06 AM
  1. ఈ వేలంలో మెట్రిక్ టన్నుకు సగటున రూ.25,370
  2. మంత్రి తుమ్మల నిర్ణయాలతో ప్రభుత్వానికి భారీ లాభం

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): రాష్ట్ర మార్క్ఫెడ్ మొక్కజొన్న విక్రయాల్లో చరిత్ర సృష్టించింది. సంప్రదాయ ఈ-టెండర్ విధానానికి బదులు ఈ-వేలం విధానాన్ని అ మలు చేయడంతో మొక్కజొన్నకు రికార్డు స్థాయిలో ధర లభించింది.  మెట్రిక్ టన్నుకు గరిష్టంగా రూ. 26,500, కనిష్టంగా రూ.24, 100, సగటున రూ.25,370 ధర నమోదైం ది. కొనుగోలు ధరతో పోలిస్తే టన్నుకు సు మారు రూ. 1,5 00 లాభం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరనుంది.

మార్క్‌ఫెడ్ నష్టాలను తగ్గించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు ఆదేశాల మేరకు పలు చర్యలు తీసుకోవడంతో మార్కెట్లో పోటీ పెరిగి, రైతులు, స ర్కార్‌కి మేలు జరిగింది. ఈ మేరకు అధికారులు సోమవారం ఒక ప్రక టనలో తెలిపా రు. మార్క్‌ఫెడ్‌ను లాభాల బాట పట్టించేలా తీసుకున్న సంస్కరణల్లో భాగంగానే ఈ-టెండర్‌కి బదులుగా పోటీని పెంచే ఈ-వేలం విధానాన్ని అమలు చేశామన్నారు. యాసం గిలో మార్క్‌ఫెడ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14. 60 లక్షల మెట్రి క్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశామన్నారు.