25 May, 2026 | 1:06 AM

ఉప సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా లక్కిరెడ్డి

25-05-2026 12:00 AM

రాజన్న సిరిసిల్ల 24 మే (విజయక్రాంతి ) సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ మండలాల మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పాల్గొని, జిల్లా ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా లక్కిరెడ్డి కమలాకర్ రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా పలువురు మండలాల ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు మాట్లాడుతూ, ఉప సర్పంచ్ ల సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం కోసం సమిష్టిగా పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో తంగళ్లపల్లి మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఆసాని శ్రీకాంత్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మందాటి రాము యాదవ్, వీరపల్లి మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అజ్మీరా రామ్ రెడ్డి నాయక్, ముస్తాబాద్ మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు విజయ్ రెడ్డి, కోనరావుపేట మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు లంబ రాజు యాదవ్, బోయిన్పల్లి మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మిట్టపల్లి శ్రీనివాస్ రెడ్డి, చందుర్తి మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గంట మల్లేష్, వేములవాడ రూరల్ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కొంపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.