బెజ్జూర్ పశు వైద్యాధికారిగా లక్ష్మీనారాయణ
02-04-2026 12:00 AM
బెజ్జూర్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి) : బెజ్జూర్ మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో నూతన పశువైద్యాధికారిగా లక్ష్మీనారాయణ బాధ్యతలు చేప ట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా పశు వైద్యాధికారి పోస్టు ఖాళీ ఉండటంతో పశుపోషకులు ఇబ్బందులు పడ్డారు. ఉట్నూరుకు చెందిన పశువైద్యాధికారి లక్ష్మీనారాయణ గతంలో వేరే రాష్ట్రంలో విధులు నిర్వహించి బెజ్జూర్ మండల కేంద్రానికి బదిలీపై వచ్చినట్లు తెలిపారు బెజ్జూర్ పశువైద్యాధికారి బాధ్యతలు చేపట్టడంతో సిబ్బంది వారికి శుభాకాంక్షలు తెలిపారు.




