1 April, 2026 | 4:28 PM

బడ్జెట్ పద్దులపై నేడు అసెంబ్లీలో చివరిరోజు చర్చ

26-03-2025 09:25 AM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో చివరిరోజు బడ్జెట్ పద్దులపై బుధవారం చర్చ జరగనుంది. సాధారణ పరిపాలన, న్యాయ, హోం, ఇంధన, లెజిస్లేచర్, రెవెన్యూ, గృహనిర్మాణ, ఆర్థిక శాఖ, ఐఅండ్ పీఆర్, నీటిపారుదల, పౌరసరఫరాల పద్దులపై నేడు శాసనసభలో చర్చించనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం అదనపు వ్యయం అంచనాలపై నేడు ఉభయసభల్లో చర్చ జరగనుంది. రాష్ట్రంలో విద్యారంగంపై నేడు మండలిలో స్పల్పకాలిక చర్చ, పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించనున్నారు.