1 April, 2026 | 6:29 PM

Breaking News

అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •   మంథనిలో రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేయండి   •   మధ్యాహ్న భోజన పథకాన్ని డిగ్రీ వరకు విస్తరించాలి   •   మృతుని కుటుంబానికి గ్రామస్తులు ఆర్థిక సాయం   •   లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి   •  

మహంకాళి పీఎస్ పరిధిలో ప్రమాదం: ఇద్దరు మృతి

26-03-2025 09:35 AM

హైదరాబాద్: సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్(Mahankali Police Station) పరిధిలో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. బైకుపై వెళ్తున్న ఇద్దరిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతులను బన్సీలాల్ పేట(Bansilalpet)కు చెందిన ప్రణయ్(18), బోయగూడకు చెందిన అక్షిత్(21)గా గుర్తించారు. కారు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.