24 June, 2026 | 2:29 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలు నేర్పించాలి

05-04-2025 11:36 PM

- విద్యార్థులు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి

- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు 

రాజేంద్రనగర్ (విజయక్రాంతి): పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు నాయకత్వ లక్షణాలను నేర్పించాలని, అప్పుడే సమాజాన్ని అర్థం చేసుకునే మంచి నాయకులుగా ఎదుగుతారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం సన్ సిటీలోని గ్లెన్డేల్ అకాడమీలో నిర్వహించిన ‘లీడర్ షిప్ డే - 2025‘ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రశాంగించారు.  వ్యక్తిత్వ నిర్మాణంలో పాఠశాలలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కేవలం మార్కులు మాత్రమే జీవితం కాదని, తమకు ఆసక్తి ఉన్న రంగంలో ప్రతిభ చూపేలా చిన్నారులను ప్రోత్సహించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కోరారు.

ప్రతి చిన్నారిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుందని.. ఇతరులతో పోల్చి వారిపై ఒత్తిడి తేవొద్దన్నారు. అబ్దుల్ కలాం మాటలను స్పూర్తిగా తీసుకొని ప్రతి విద్యార్థి బాల్యంలోనే గొప్ప లక్ష్యాన్ని ఎంచుకొని దాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఎదిగి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. టెక్నాలజీ రోజురోజుకీ కొత్త పుంతలు తరుణంలో వినూత్నంగా ఆలోచించాలన్నారు. అన్ని రంగాల్లో మెరుగ్గా రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో జీఎస్ జీ డిప్యూటీ కంట్రీ డైరెక్టర్ అవ్నీష్ సింగ్, గ్లెన్డేల్ గ్రూప్స్ డైరెక్టర్ మీనూ సలూజా, లైఫ్ కోచ్ అండ్ మెంటార్ డా.కన్నన్ తదితరులు పాల్గొన్నారు.