రాజన్న ఆలయంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ప్రత్యేక పూజలు
16-06-2024 03:56 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఆయనకు అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆయనకు ఈఓ రామకృష్ణ స్వామివారి తీర్థప్రసాదాలు అందించి సత్కరించారు.






