26 May, 2026 | 2:16 PM

బిట్టుపల్లిలో తాగునీటి కోసం ఆందోళన

17-06-2024 12:05 AM

మంథని, జూన్ 16: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని బిట్టుపల్లిలో ఆదివారం తాగునీటి కోసం గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో తాజా మాజీ సర్పంచ్ పోగుల సదానందం ఇంటి ఎదుట ఆందోళన చేశారు. చాలా రోజుల నుంచి తాగునీటి కష్టాలు ఉన్నా అధికారులు, ప్రజాప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని వాపోయారు. వర్షాలు లేక బోరుబావులు అడుగంటిపోయి నీటి కొరత ఏర్పడిందని, మిషన్ భగీరత నీళ్లు కూడా రావడంలేదని చెప్పారు. తాగునీటి ఇబ్బందులు తీర్చాలని కోరారు. స్పందించిన మాజీ సర్పంచ్ అధికారులతో మాట్లాడి గ్రామంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.