3 August, 2026 | 9:55 AM

కుటుంబ కలహాలతో గృహిణి మృతి

03-08-2026 08:51 AM

పీఎస్ లో ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు

జవహర్ నగర్ ఆగస్టు 2 (విజయక్రాంతి): కుటుంబ కలహాలతో ఓ గృహిణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం... యాప్రాల్ ప్రాంతం లో బి. బాలరాజు భార్య లలిత ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. బాలరాజు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి.

మూడు నెలల క్రితం లలిత( 28) ను భర్త కొట్టడంతో నాగర్ కర్నూల్ జిల్లా కేశంపేట తండా అయిన పుట్టింటికి వెళ్ళింది. మూడు రోజుల క్రితం బాలరాజు వద్దకు లలితను తన అన్నబాధ్య  తీసుకువచ్చాడు. కోపంతో రగిలిపోయిన బాలరాజు భార్య లలిత బామ్మర్ది బాధ్య ను కొట్టాడు. ఈనెల 1వ తేదీన భార్య లలిత వాటర్ హీటర్ బకెట్లో చేతిని పెట్టుకుందని స్థానికులు బాలరాజుకు సమాచారం అందించారు. వెంటనే లలితను ఆర్మీ దావకానాకు తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. హీటర్ బకెట్ కు సంబంధించిన ఘటన భర్త బాలరాజు వేధింపులతోనే లలిత మరణించి ఉంటుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు లలిత కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.