జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయేంద్ర బోయి
మహబూబ్ నగర్: జిల్లా కలెక్టర్‌గా బి. విజయేంద్ర బోయి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లాకు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ కు అర్.బి.అతిథి గృహం వద్ద పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు, అదనపు ఎస్.పి.రాములు, అర్.డి. ఓ నవీన్ స్వాగతం పలికారు. అనంతరం నేరుగా జిల్లా కలెక్టరేట్ లో తన చాంబర్ కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
కొత్త కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ను ఛాంబర్ లో అదనపు కలెక్టర్(రెవెన్యూ) ఎస్.మోహన్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కృష్ణ,డి.పి.అర్. ఓ శ్రీనివాస్,షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ డి.డి. పాండు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ భాస్కర్, కలెక్టరేట్ పరిపాలన అధికారి శంకర్,రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఏ.నట రాజ్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలెక్టర్ కు పూల బొకేలు అందించారు. అనంతరం తహశీల్దార్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధరణి పెండింగ్ దరఖాస్తులు, సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా ఏర్పాట్ల పక్కగా ఉండేలా చూడాలని విజియేంద్ర బోయి ఆదేశించారు.






