17 April, 2026 | 8:33 PM

Breaking News

సోనాల బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు   •   ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •  

సామజిక సమానత్వం కోసం పోరాడుదాం

05-04-2025 07:50 PM

మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య..

కాటారం (విజయక్రాంతి): సామాజిక సమానత్వం కోసం పోరాడుదామని, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిద్దామని మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రం ఆదర్శ నగర్ కాలనీలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ... దేశ స్వతంత్రం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడుదామని, ఆ లక్ష్యంతో పోరాడిన ఆదర్శ నేత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిద్దామని అన్నారు.

దేశానికీ అయన చేసిన సేవలు నిరుపమానమని, అయన చేపట్టిన పదవులకు వన్నె తెచ్చారని, దళితుల అభ్యున్నతి కోసం జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు. యువత జగ్జీవన్ రామ్ని ఆదర్శంగా తీసుకొని  రాజకీయాల్లోకి రావాలని, ఆయన ఆశయం కోసం పని చేయాలనీ మాజీ ఎంపీపీ సమ్మయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం మాజీ ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్, ఆదర్శ నగర్ కాలనీ కన్వీనర్ ఆత్మకూరి కుమార్ యాదవ్, హట్కర్ రమేష్ నాయక్, గడ్డం కొమురయ్య యాదవ్, పంతకాని మల్లికార్జున్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మంత్రి మధు, పందిర్ల రాజన్న, దుర్గ రావు, చిర్ల ఎల్లా రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.