8 May, 2026 | 8:21 PM

ప్రకృతిని కాపాడుకుందాం!

18-05-2024 12:05 AM

మానవాళి ఆధునిక జీవన మోజులో అడవులను నరుకుతూ, అవసరానికి మించి ప్లాస్టిక్‌ను వినియోగిస్తూ, చెట్లను పెంచే నైతిక బాధ్యతను విస్మరిస్తుండటంతో భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. నేడు తాగడానికి మంచినీరు, శ్వాసించడానికి స్వచ్ఛమైన ప్రాణవాయువు దొరకని ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికైనా బాధ్యతను గుర్తిద్దాం. పచ్చదనాన్ని పెంచుదాం. ప్రకృతి ఆగ్రహంతో ప్రదర్శించే విధ్వంసాన్ని ఆపడం అసాధ్యం. అందుకే, ‘ప్రకృతి అవసరాలను మాత్రమే తీరుస్తుంది, కానీ అంతులేని కోరికలను కాదు’ అని ఏనాడో మహాత్మా గాంధీ చెప్పిన మాటను విశ్వసిస్తూ, వారి బాటలో నడుద్దాం.

- ఫిజిక్స్ అరుణ్ కుమార్, నాగర్ కర్నూల్