30 June, 2026 | 7:52 PM

Breaking News

మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు పలు దుకాణాల్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు   •   పౌర హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదు   •   ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలి   •   సిద్దాపూర్ రిజర్వాయర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి   •   సుల్తానాబాద్ మున్సిపల్ ను అభివృద్ధి చేయడమే లక్ష్యం   •   చిన్న గాలి వానోస్తే కరెంటు గల్లంతే   •   మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   రామేశ్వరపల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ప్రారంభం   •   ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడి యువకుడు మృతి   •   మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •  

ప్లాస్టిక్ కవర్లతో ప్రమాదం

18-05-2024 12:05 AM

రాష్ట్రమంతటా ప్లాస్టిక్ కవర్ల నిషేధం అమలు కావడం లేదు. వాటి వాడకం విచ్చలవిడిగా సాగుతోంది. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో సమస్య తీవ్రమవుతోంది. చెత్త నుంచి 25 శాతం ప్లాస్టిక్ కవర్లు వస్తున్నట్టు అంచనా. అనేక మురుగు కాల్వలు, చెరువులు, కుంటలు, చెత్త కుప్పల్లో పాలిథిన్ సంచులే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. నిషేధిత కవర్లను బహిరంగంగానే విక్రయిస్తున్నా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్న దాఖలాలు లేవు. ప్రజలు వాటికి ప్రత్యామ్నాయ పద్ధతులను ఎన్నుకోవాలి. అధికారులు కఠినంగా వ్యవహరించాలి.

- కామిడి సతీష్ రెడ్డీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా