ప్రకృతిని సంరక్షించి భావితరాలకు సుస్థిరతనిద్దాం
అయిజ మార్చి 25: అయిజ మండలం ఉత్తనూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఉపాధ్యాయుడు టీ వీరన్న ఆధ్వర్యంలో విద్యార్థులచే సీడ్ బాల్స్ తయారు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీడ్ బాల్స్ అనేవి విత్తనాలు మట్టి మరియు పోషక పదార్థాల మిశ్రమంతో తయారవుతాయని, ఇది బంజరు భూముల్లో, ప్రభుత్వ భూముల్లో మొక్కలు పెరిగేందుకు సహాయపడతాయని మరియు సకాలంలో వానలు కురవడానికి ఉపయోగపడతామన్నారు.
ఈ కార్యక్రమాల ద్వారా ప్రకృతి సమ తుల్యతను కాపాడడం జరుగుతుందని ప్రతి ఒక్కరు చెట్లు నాటడం ప్రకృతిని సంరక్షించడం వల్ల భూమిని, పర్యావరణాన్ని కాపాడి భవిష్యత్తు తరాల సుస్థిరత అభివృద్ధికి పాటుపడవచ్చు అని ఆయన తెలియజేశారు . ఈరోజు మనం చేసే చిన్ని చిన్ని ప్రయత్నాలే రేపటి పచ్చని (హరిత) ప్రపంచానికి నాంది పలుకుతుందని విద్యార్థులకు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.




