విద్యారంగాన్ని నిరాశపర్చిన బడ్జెట్
అసెంబ్లీ ముట్టడికి ఏఐఎస్‌ఎఫ్ యత్నం.. అరెస్ట్
హైదరాబాద్, సిటీబ్యూరో మార్చి 25 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 20న ప్రవేశపెట్టిన బడ్జెట్ విద్యారంగాన్ని తీవ్రంగా నిరాశపరిచిందని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపు నిచ్చారు. విద్యార్థులు అసెంబ్లీలోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు విద్యార్థి నాయకులు, విద్యార్థులను అరెస్టు చేశారు.
జీవో 84 రద్దుకు ముట్టడికి యత్నం..
లక్ష మంది కార్మికుల ఉపాధిని దెబ్బతీసేలా ఉన్న వివాదాస్పద జీవో 84ను తక్షణమే రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో నాంపల్లి, గన్ పార్క్, సచివాలయ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.




