వర్షాకాలం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూద్దాం
బోథ్,(విజయక్రాంతి): వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు పేర్కొన్నారు మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలు అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు తాసిల్దార్ మల్లేశం ఎంపీవో ఎస్సై ఏఈఓలతో పాటుగా ఐసిడిఎస్ ఉపాధి హామీ సిబ్బందితోపాటు వివిధ గ్రామాల కార్యదర్శిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో తాసిల్దార్లు మాట్లాడుతూ వర్షాకాలంలో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు నీటి కాలుష్యం లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు గ్రామాల కార్యదర్శిలను కోరారు మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఇబ్బందులు కలవకుండా చూడాలని అంతేగాక నీటి కాలుష్యం జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు వైద్య సిబ్బంది వ్యాధులు ప్రబలకుండా ప్రజలను ముందస్తు చైతన్యం చేయాలని కోరారు సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.






