మహిళా కాంగ్రెస్ సభను విజయవంతం చేద్దాం
రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్
చేవెళ్ళ మే 19(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలో మహిళా కాంగ్రెస్ భారీ సభ జరుగనున్న నేపథ్యంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని మంగళవారం వారివారి స్వగృహాల్లో మర్యాద పూర్వకంగా కలిసి పుల్లగుచ్చం అందజేసి శాలువతో సత్కరించారు. జిల్లాలో జరుగనున్న భారీ సభకు రావాలని ఆహ్వానించారు. అనంతరం జ్యోతి భీమ్ భరత్ ప్రకటన విడుదల చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో దశలవారిగా అమలు చేస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమం భద్రతకు కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో త్వరలో జరగనున్న కాంగ్రెస్ సభను విజయవంతం చేయాలని నాయకులు కార్యకర్తలను ఆమె కోరారు. అయితే జిల్లాలో సభ ఎప్పుడు జరుగుతుందో పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.






