భద్రతకు భరోసా ఇద్దాం!
ప్రతీ దేశం నేడు పారిశ్రామిక రంగం వైపు దృష్టి సారించి విశ్వవ్యాప్తంగా అభివృద్ధి చెందాలని భావిస్తోంది. ఈ క్రమంలో పరిశ్రమలను స్థాపించి, ఉపాధిని కల్పిస్తూ వాళ్ల దేశప్రగతికి బాటలు వేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో కారణాలు ఏవైనా, ఆయా కర్మాగారాలలో జరిగే పేలుడు సంఘటనలు, అగ్నిప్రమాదాలు, విద్యుత్ విపత్తులు వంటివి నిత్యం సంభవిస్తునే ఉన్నాయి.
ఇప్పటికీ పనికి వెళ్ళిన వారు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారో లేదో అన్న ఆందోళనతో కుటుంబసభ్యులు బతకవలసి రావడం బాధాకరం. దురదృష్టవశా త్తు కుటుంబపెద్దకు ఏదైనా ప్రమాదం జరిగితే లేదా ప్రమాదవశాత్తు మరణించినా వారి పరిస్థితి అగమ్యగోచరమవుతుంది. అందుకే, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భద్రతను పాటించాలి. ప్రతి కార్మికు డూ తాను తీసుకోవలసిన కనీస ముందు జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి.
ఈ రకంగా అప్రమత్తత వహించగలిగితే, ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుం ది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతి ఊపందుకుంటున్న కొద్దీ ఆ పరిశ్రమలతోపాటు ప్రమాదాలూ అంతే స్థాయిలో సంభవిస్తున్నాయి. ఉద్యోగులు, కార్మికులు, ఇతర ప్రజల భద్రత, ఆరోగ్య రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి.
తగిన భద్రత, ఆరోగ్య రక్షణ, వాతావరణ మెళకువలు వంటి అంశాలపై కార్మికుల్లో సరైన అవగాహన కల్పించడం కోసం ప్రతీ సంవత్సరం ‘జాతీయ భద్రతా దినోత్సవాన్ని’ మార్చి 4న జరుపుకుంటున్నాం.
అయిదు దశాబ్దాల కిందటే శ్రీకారం
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలుత భారతదేశంలో పారిశ్రామిక కేంద్రమైన ముంబైలో కార్మికుల భద్రత గురించి న చర్చ మొదలైంది. 1962లో జరిగిన రాష్ట్ర కార్మిక శాఖామంత్రుల సమావేశంలో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సి న చర్యలు, కార్యక్రమాలపై సమగ్ర చర్చలు జరిగాయి. వివిధ పరిస్థితులు, పర్యవసానాలు, ప్రమాదాల పట్ల ప్రజలలో అప్ర మత్తతను పెంపొందించడానికి చేయవలసిన కృషి లోతుగా ప్రస్తావనకు వచ్చింది.
కార్మికులలో భద్రతపట్ల అవగాహన పెంచడానికి, ఆ మేరకు నిర్వహణకు ప్రభుత్వప రంగా ఒక సంస్థ అవసరమని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత పారిశ్రామిక భద్రతపైన తొలి సమావేశం 1965లో ఢిల్లీలో జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పలు సంస్థల నిర్వాహకులు పాల్గొన్న ఆ సమావేశంలో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ‘భద్రతామండలి’ని ప్రారంభించాలని నిర్ణయించారు.
ఆ ఏడాది డిసెంబర్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించగా, 1966 మార్చి 4న ‘జాతీయ భద్రతామండలి’ ఏర్పడింది. కార్మిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఆ మండలి ప్రారంభమైన రోజునే ‘జాతీయ భద్రతా దినోత్సవం’ జరుపుకుంటున్నాం. నాటినుండి వారం రోజులుపాటు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తూ, ఈ మేరకు ప్ర జలు, కార్మికులు, యాజమాన్యాలలో అవగాహన పెంచే ప్రయత్నం జరుగుతున్నది.
అందరిపైనా సమాన బాధ్యత
స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పై సంస్థ కార్మికుల భద్రత, ఆరోగ్యం, పర్యావరణ అంశాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేయడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నది. పారిశ్రామిక రంగానికి చెందిన వారందరినీ ఇందులో భాగస్వాములను చేయడాన్ని రెండవ లక్ష్యంగా పాటుపడుతున్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను గుర్తెరగడమే మూడో లక్ష్యంగా సంస్థ కృషి చేస్తున్నది.
ఇందులో భాగంగా సమావేశాలు, శిక్ష ణా కార్యక్రమాలు, సెమినార్లు, ఉద్యోగు లు, కార్మికులతో భద్రతాపరమైన ప్రతిజ్ఞలు చేయించడం జరుగుతోంది. ప్రమా దాలు ఎలా జరుగుతున్నాయి? అవి జరిగేప్పుడు ఎలా స్పందించాలి? అనే అంశాల పై అవగాహన కల్పిస్తున్నారు. ఉద్యోగులు, సామాన్య ప్రజలు తమ జీవన విధానం లో, వృత్తుల్లో భద్రత, ఆరోగ్య రక్షణను ఒక అంతర్భాగంగా మలచుకునేలా చేయడం ద్వారా ప్రమాదాలను నివారించ వచ్చని నిరూపిస్తున్నారు.
పొట్ట నింపుకోవడానికి ఎంత కష్టమైన పనులైనా, ఎంత ప్రమాదకరమైన పనులై నా కార్మికులు చేస్తుంటారు. ఈ పనుల్లో కొంతమంది కాళ్లు చేతులు పోగొట్టుకుం టే, మరి కొందరు ప్రాణాలుకూడా కోల్పోవలసి వస్తుంది. ప్రతి పనిలోను ఏదో ఒక ప్ర మాదానికి ఆస్కారం ఉండవచ్చు. కొన్ని రకాల ప్రమాదాలు ముందుగా గుర్తించి జాగ్రత్త పడవచ్చు. కాని, చాలావరకు అధి క ప్రమాదాలు కార్మికుల అజాగ్రత్తవల్ల సంభవిస్తున్నావే అని నిపుణులు అంటున్నారు.
అవి రహదారి ప్రమాదాలైనా, పారిశ్రామిక ప్రమాదాలైనా మానవ నిర్లక్ష్యాలవల్ల జరుగుతుండడం దురదృష్టక రం. క్రమక్రమంగా ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నందున పారిశ్రామిక, రహదా రి భద్రతలమీద అందరూ ప్రత్యేక దృష్టి పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నా యి.
తగు జాగ్రత్తలతో చాలావరకు ప్రమాదాలను నివారించుకోవచ్చు. అనుకోకుం డా జరిగే ప్రమాదాల నుండి వ్యక్తులు ఎలా బయటపడాలో అవగాహన ఏర్పరచుకోవడం వల్ల మరణాల సంఖ్యను తగ్గిం చే అవకాశం ఉంది.
కార్మికులు కష్టపడ్డప్పటికి ఆనందంగా కుటుంబంతో ఉండా లంటే తప్పకుండా భద్రతా నియమాలు పాటించి, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రత్యేక దినోత్సవం వేళ కార్మికులు వాటన్నింటిపైనా సరైన అవగాహనకు రావాలి. ఫలితంగా భద్రతకు భరోసా ఏర్పడి, దేశం పురోభివృద్ధి చెందుతుంది.
గడప రఘుపతిరావు సెల్: 9963499282






