స్కూళ్ల కంప్యూటరీకరణ ఎప్పుడు?
కాలం ఏఐ యుగంలోకి మారినా రాష్ట్రంలోని అనేక ఆఫీసుల్లో ముఖ్యంగా విద్యారంగంలో రాతపూతల పని తప్పడం లేదన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా విద్యార్థులకు అవసరమయ్యే అనేక పత్రాలు, టీసీలు, బోనఫైడ్ మొదలైన పత్రాలు చేతివ్రాతలో రాస్తున్నారు. రాసేవారు ఎంతో జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. ఒక్కోసారి అనేక తప్పులు దొర్లుతుంటాయి. అప్పుడు వాటిని సవరించాల్సి ఉంటుంది.
ఇట్లా విద్యారంగం లో కార్యాలయాల పనులు సాంప్రదాయ పద్ధతులలోనే ఏళ్ళుగా కొనసాగుతుండ డం విచారకరం. ఈ నేపథ్యంలోనే ప్రభు త్వం అన్ని కార్యాలయాలలో ‘ఈ’ ఆఫీసులను ఏర్పరచాలి. ఫలితంగా అనేక సౌక ర్యాలు ఏర్పడతాయి. విద్యార్థుల ప్రగతి నివేదికలను రూపొందించే వీలుగా ఎప్పుడంటే అప్పుడు ఇచ్చే విధంగా రూపొం దించవచ్చు. విద్యార్థులు రాసే పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి, గణాంక శాస్త్ర పట్టీలను రూపొందించుకోవచ్చు.
ఎస్.పి.ఎస్. సాఫ్ట్‌వేర్ ద్వారా పరిశో ధనకు దత్తాంశాలను రూపొందించవచ్చు. అనేక రకాల గ్రాఫ్ ద్వారా చూడగానే విద్యార్థుల ప్రగతి, పాఠశాలలు, కళాశాలలు, వివిధ బోధనా, క్రీడా, వైజ్ఞానిక రంగాలలో కనబర్చిన అత్యుత్తమ ప్రతిభను నమోదు చేసి భద్రపరచవచ్చు.
స్కూల్ రికార్డ్స్‌ను మొత్తం డిజిటలైజ్ చేయడానికి వీలుంటుంది. పుస్తకాలలో రాసిన టీసీలు, అడ్మిషన్ సంఖ్యలు పాడైపోతాయన్న బెంగ లేకుండా కంప్యూటర్లలో, హార్డ్ డిస్క్‌లలో భద్రపరచవచ్చు. విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బంది వివరాలనూ డిజిటల్ రూపంలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు.
డా. సుంకర రమేశ్






