కుంభమేళా కొత్త రహస్యాలు
ఇటీవల ముగిసిన అద్భుత జన ప్రభంజనం మహాకుంభమేళా. వేదాలు, పురాణాలతో దీనికిగల సంబం ధం చాలామందికి తెలుసు. కానీ, అనేకులకు తెలియని రహస్యాలు మరిన్ని ఉన్నా యి. ‘మత్స్య పురాణం’,‘చైతన్య చరితామృతం’, తులసీదాస్‘రామచరిత మానస’ వంటివాటిలోనూ ప్రతి సంవత్సరమూ జరిగే ఈ మాఘమేళా ప్రస్తావన ఉంది. 12 సంవత్సరాల చక్రం కుంభమేళా గురించి కాకుండా, మాఘమేళా విశేషాలు మహాభారతం సహా ఇతర పురాణాలలో ప్రస్తా వించారు.
మాఘమేళా పూజాకాలాలలో ఉండే పుష్కరాల చుట్టూ అనేకానేక కార్యక్రమాలు కనపడతాయి. వీటిని బృహ స్పతి గ్రహం వివిధ జ్యోతిష రాశుల్లోకి సంచరించి, మారడం ద్వారా వచ్చే నది పుష్కరోత్సవాలుగా నిర్వహిస్తారు. ‘జాతక పారిజాతం’ ప్రకారం, ఒక బ్రాహ్మణుడు అనే వ్యక్తి పుష్కర శుద్ధికోసం నీటిలో చాలాకాలం నివసించే శక్తిని తపస్సుద్వారా సంపాదించాడు. అతను బృహస్పతి ప్రార్థ న జరిపి, దైవరూపంతో ఆయా పుష్కరాలను అనుసరించి 12 పవిత్ర నదులలో ప్రవేశిస్తుంటాడు.
రాజా హర్షవర్ధన్ (590 క్రీ.శ.) ప్రస్తావించిన ప్రగతి సంఘటనలను ప్రాచీన చైనీయ పర్యాటకుడు హ్యుయన్ త్సాంగ్ చరిత్రలో రచించారు. కానీ, 19వ శతాబ్దానికి ముందు ప్రస్తుత కాలానికి సంబంధించిన 12 సంవత్సరాల కుంభమేళా ప్రయాగ్‌లో జరగడం గురించి ఎటువంటి చారిత్రిక రికార్డులు లేవని చరిత్రకారులు అంటారు.
క్షీరం, నీరం అమృత ప్రవాహాలుగా..
కుంభమేళాకు సంబంధించిన ఎంతో వైదిక వాఙ్మయం సాహిత్యంలో, ప్రత్యక్షంగా లేకపోయినా కొంతమేరకు ప్రస్తావించారు. ఉదా॥కు అథర్వవేదం శ్లోక కాండ 4, సూక్త 34, మంత్ర 7లో ఈ విధంగా చెప్పారు.
చతురః కుంభాంశ్చతుర్ధా దదామి
క్షీరేణ పూర్ణాంగా ఉదకేనా దధ్నా
ఏతాస్త్వా ధారా ఉప యంతు సర్వాః స్వర్గే లోకే మధుమత్పిన్వమానా
ఉప త్వాతిష్టంతు పుష్కరిణీః సమంతాః॥
అంటే నాలుగు కుండలలో నిండిన అమృతం, పూర్ణంగా క్షీరం, నీరం అనే ప్ర వాహాలు అందరికోసం పారుతున్నాయి. స్వర్గమయ తీయదనంతో నిండిన పవిత్రజలాలు అందరకీ లభిస్తాయంటున్నారు. కుంభం, పుష్కరం అనే పదాలు చాలా ప్రాచీనమైనవి. చాలాసార్లు ప్రస్తావితమైనవి. ఇవన్నీ మేఘమేళాలలో అనుసంధిం చారు. మరో సందర్భంలో అథర్వవేదంలో కాండ 19, సూక్త 53, మంత్ర 3లో
పూర్ణః కుంబోధి కాల ఆహితస్తం వై పశ్యామో బహుధా ను సంతః
స ఇమా విశ్వా భువనాని ప్రత్యాఙ్కాలం తమాహుః పరమే వియోమనమ్ ॥
ఈ విశ్వం అంతా నిండి, పూర్ణమై స్ప ష్టంగా కుంభ కాలంలో ఉన్నాయని వివరిస్తున్నారు. అవి పరమమైన, సర్వోత్కృష్ట మైన స్వర్గానికి విస్తరిస్తాయి. కుంభలోని ముఖ్యమైన భాగం ఏమంటే మొత్తం సమాహారంలో స్వాభావికంగా ఉన్న ఆలోచనల వైవిధ్యం కనిపిస్తుంది.
మహావిశ్వం వలె అంతులేని కథ
144 సంవత్సరాలకు ముందు మూ డు రకాల త్రివేణీ సం గమాలు మహాకుంభమేళా అనే అద్భుత జాతర కొన్ని వారా లు సాగాయన్న మాట. వాటిమధ్య యోగ, ఆధ్యాత్మిక, ఖగోళ, భౌ తిక వ్యవహారాలను ప్రతిబింబిస్తున్నాయి. మహావిశ్వం వలె ఇది అంతులేని కథ.
“వేద జ్యోతిష శాస్త్రంలో, అటువంటి గ్రహస్థితులు ఆత్మసిద్ధిని కలిగించేలా బ్ర హ్మ తాత్త్విక శక్తులను పెంచేందుకు దోహ దం చేస్తాయి. కుంభమేళా వంటి మేళాలు ప్రత్యేక గ్రహదిశలు, ఆయా సమయాలలో నిర్వహిస్తారు. ఉదా॥కు గురు (బృహస్పతి), సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహా ల సమన్వయాలు, ఇవి పవిత్రనదుల శుద్ధీకరణ శక్తిని పెంచుతాయని వేద పండితు లు విశ్వసిస్తున్నారు.
గంగ, యమునా కనిపించే నదులు గ్రహణశక్తిని సూచిస్తాయి. కనిపించని సరస్వతి నది ఆ రెండింటినీ అనుసంధానించే చైతన్యాన్ని ప్రతిబిం బిస్తుంది” అని ఆధ్యాత్మిక దృష్టికోణం గురించి వినీత్ మిట్టల్ 2025 జనవరి 26న వివరించారు.
ఈ సంయోజన సమయాల్లో, ఆధ్యాత్మిక సంగమంలో స్నానం పునర్నవీకరణ చెందుతుంది. కార్మిక (అంటే కర్మ అనే పనులకు సంబంధించిన) మలినాలను శుద్ధి చేయడానికి, ఉన్నత ఆనంద, ప్రవాహాలతో మళ్ళీ సమన్వయం చేసుకోవడానికి ఇదొక అవకాశం. మహాకుంభ ‘బ్రహ్మాండిక కారకుల’ ప్రాశస్త్యం కలిసిన గొప్ప సంగమం. అన్వేషకులను ఈ గాఢమైన పునర్నవీకరణ అనుభ వించడానికి ఆకర్షిస్తుంది. అంతేకాదు, గంగ కు చాలామంది ఔషధ, ఆధ్యాత్మిక లక్షణాలు కూడా ఉన్నట్లు నిర్ధారించారు.
గంగాజలంలో ఆత్మశుద్ధి లక్షణాలు
గంగోత్రి హిమనదీ ప్రాంతం నుండి ఉద్భవించి, అనేక ఔషధిక ఔషధాలు ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. అందుకే, గంగానదికి ప్రత్యేక లక్షణాలు ఒనగూరాయి. పరిశోధనలు గంగలో బ్యాక్టీరియోఫేజ్‌లు ఉంటాయని సూచిస్తాయి. ఇవి దాని ఆత్మ-శుద్ధి లక్షణాలకు సహకరిస్తాయి. ఆధ్యా త్మికంగా, ఈ లక్షణాలు శరీర, మనసు, ఆత్మను శుద్ధి చేసే పాత్రను పెంచుతాయి.
గంగ వంటి శీతల ఖనిజం సమృద్ధిగా ఉన్న జలాలలో నానడం, శరీర శక్తిని స్థిరపరచడానికి దోహద పడుతుంది. దాని బయో-ఎలక్ట్రికల్ రంగాన్ని పునఃప్రారంభించడానికి జీవన శక్తిని ఉల్లాస పరచడానికీ సహాయ పడుతుందని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు వివరిస్తారు.
గంగ (పవిత్రత), యమున (భక్తి), సరస్వతి (జ్ఞానం) సంగమం శరీర, మనసు, ఆత్మ ఐక్యతను ప్రతిబింబిస్తుంది. ఇది హిం దూ త్రయిబ్రహ్మ (సృష్టి), విష్ణు (పాలన), మహేశ్ (పరివర్తన)ని ప్రతిబింబిస్తుంది. ఈ పవిత్రయోగం రూపాల బహువిభజన నుండి ఒకే, ఏకీకృత ‘బ్రహ్మాండిక యథా ర్థం’ (పదార్థం కాదు) అవగాహనవైపు ప్రయాణాన్ని సూచిస్తుందని వినీత్ మిట్టల్ వివరించారు.
ఆసక్తికరమైన సిద్ధాంతాలు
మరో రచయిత డా. మృత్యుంజయ గుహ మజుందర్ అభిప్రాయం ఇలా ఉంది. “ఇది సమష్టి సుస్థిరత కలిగిన ప్రత్యే క ఉత్సవం. ఇక్కడ భక్తి, బ్రహ్మాండం, ఆశ్చ ర్యం ఒక్కటవుతాయి. కుంభమేళా తేదీలు నిర్ణయించే వివరమైన గణనాశాస్త్రం, ఖగోళ కదలికలపై అద్భుతమైన అవగాహనను కలిగిస్తుంది. అదే విధంగా ఈ పవిత్ర సమావేశాల్లో నీరు అద్భుత రోగ వ్యతిరేక (యాంటీబ్యాక్టీరియల్) లక్షణాలను కలిగి ఉన్నాయి.
అంతేకాక, ఆసక్తికరమైన సిద్ధాంతాలు కుంభమేళాతో సంబంధం ఉన్న విద్యుత్ క్షేత్రాల పరిమాణాలను సూచిస్తున్నాయి. ఇది భౌతిక విజ్ఞానం, ఆధ్యాత్మిక సత్యం ఒక దృశ్యమైన (సాదృశ్యమైన కా దు) అంగీకారం ఏర్పరుస్తుంది. దీనిద్వారా కుంభమేళాలలో పాల్గొన్నవారు ఉన్నతమైన జీవన లోతైన రహస్యాలను అన్వే షించటానికి సంసిద్ధమవుతారు.”
మజుందార్ వ్యాసం ఇంకా ఇలా పేర్కొన్నది. “2025 మహాకుంభా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంది. ఏఐ పవర్డ్ వ్యవస్థలు 2,700 సీసీటీవీ కెమెరాల (328 ఎ.ఐ.-ఆధారిత) సహాయంతో, నీటిలో నడిచే డ్రోన్లు కట్టి ఉన్నాయి. డ్రోన్లు పర్యవేక్షణ కోసం, బహుభాషా కుంభ SahAIyak అనే పేరుతో సహాయక యాప్‌ను రియల్- టైమ్ మార్గదర్శకత, సాంస్కృతిక సమాచారం అందించే పనులకోసం సహాయం చేస్తాయి.
ఈ కుంభమే ళాకు ఈ శాస్త్రీయ ఆచారం కొత్తదేమీ కా దు. కానీ, కుంభలోని మూల సత్యాన్ని ప్రతిబింబించే ఒక పురాతన శాస్త్రీయ పరిష్కారంగా ఇది అర్థమవుతుంది. ఈ కుంభ మేళా మూలాలు హిందూ పురాణంలో ఉంటాయి. ఇది దేవతలు, అసురులు చేసే సముద్ర మథనం సంఘటనతో వివరిస్తాయి. ఈ ఘటనలో కుంభం (కుండ) పుట్టింది. ఇందులో అమృతం ఉంటుంది. అసురుల నుండి ఈ కుంభాన్ని రక్షించవలసి ఉంటుంది.
ఇంద్రుడి కుమారుడు జయంత్ ఆకాశంలో కుంభాన్ని తీసుకుని వెళతాడు. ఈ ప్రయాణంలో అమృతం నాలుగు బిందువులు భూమిపై పడతాయి. అవే ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ప్రదేశాలు. ఈ నాలుగు ప్రాంతాలు కుంభమేళా పవిత్ర క్షేత్రాలైనాయి. ఇదంతా హిందువుల నమ్మకాలకు సంబంధించిన విషయం. రుజువులు పరిశోధిస్తే తేలే అవకాశం ఉంది.






