12 March, 2026 | 4:48 AM

సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేద్దాం

12-03-2026 01:18 AM

డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ 

నిర్మల్, మార్చి ౧౧ (విజయక్రాంతి):  నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని సంస్థకతంగా బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కృషి చేద్దామని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమో బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం పార్టీ పరిశీలకులు చంద్రశేఖర్ గౌడ్ మాజీ మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి  నియోజకవర్గ ఇన్చా ర్జి శ్రీహర్‌రావు మాజీ ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి జిల్లా గ్రంథాల చైర్మన్ అర్జున్‌మన్ అలీ, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి తో కలి సి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

నిర్మల్ జిల్లాలో త్వరలో జరగబో యే జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. త్వరలో జిల్లా మండల కమిటీ కాంగ్రెస్ వివిధ విభాగాల కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తప్పకుండా పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. పార్టీ నాయకులందరూ కూడా పార్టీ కార్యక్రమాల ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భీమ్ రెడ్డి కృష్ణవేణి, రాజేశ్వర్ నరసింహారెడ్డి, నాందేడకు చిన్ని నర్సారెడ్డి పార్టీ నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లకు సన్మానం చేశారు.