15 June, 2026 | 8:42 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

లైబ్రరీలకు ఆదివారం సెలవు వద్దు

30-10-2024 12:00 AM

రాష్ట్రంలోని గ్రంథాలయాలకు ప్రస్తుతం ఉన్న ఆదివారం సెలవు దినాన్ని మరో రోజుకు మార్చాలి. దీనివల్ల ఎక్కువమందికి లైబ్రరీలను ఉపయోగించుకొనే వీలు కుదురుతుంది. ప్రభుత్వ సంస్థలకు ఆదివారం సెలవు రోజు కాబట్టి, పలువురు ఉద్యోగస్తులు కాలక్షేపం కోసం గ్రంథాలయాలను వినియోగించుకొనే అవకాశమూ లభిస్తుంది. ఇంకా, విద్యార్థులు, నిరుద్యోగులకు ఆదివారం తీరికగా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో గ్రంథాలయాలకు శుక్రవారం సెలవు ఇస్తున్నారు. ఇదే పద్ధతిలో తెలంగాణలోని లైబ్రరీలకూ ఆదివారం తొలగించి శుక్రవారం లేదా మరో రోజు సెలవు దినం ఇవ్వాలి.

 షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్