15 June, 2026 | 8:19 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

15-06-2026 07:21 PM

- 11 కేవీ లైన్ నిర్వహణ పనుల కారణంగా అంతరాయం

గజ్వేల్,(విజయక్రాంతి): గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం 16వ తేదీన విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు విద్యుత్ శాఖ గజ్వేల్ ఏఈ మారుతి తెలిపారు. 11 కేవీ విద్యుత్ లైన్ నిర్వహణ పనుల కారణంగా ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తూప్రాన్ రోడ్, సంగాపూర్ రోడ్ వాటర్ ట్యాంక్ వెనుక, ఇందిరా పార్క్, ఫిష్ మార్కెట్ రోడ్డు, అంబేద్కర్ చౌరస్తా, గజ్వేల్ డబుల్ బెడ్‌రూమ్ కాలనీ, జర్నలిస్ట్ కాలనీలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రహమత్‌నగర్, తూప్రాన్ రోడ్, జలిగామ బైపాస్ రోడ్, మదీనా మజీద్ పరిసర ప్రాంతాలు మరియు ఓల్డ్ ఎంపీడీవో కార్యాలయం ఏరియాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.