2 March, 2026 | 7:30 AM

సొంతింటి కల సాకారంతోనే జీవితం సార్థకం

02-03-2026 12:35 AM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

హన్వాడ మార్చి 1: ప్రతి వ్యక్తికి సొంత ఇంటి కల సహకారం చేసుకోవాలని తపన ఉంటుందని అప్పుడే వారి జీవితం సార్థకం చేసుకున్నామనే భావన కలుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని హన్వాడ మండలం ఎనిమిది తాండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. మారెమ్మయాడి జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, సేవాలాల్ మహారాజ్ వారిని, మారెమ్మయాడి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు భద్రమైన నివాసం కల్పించడం ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని ఆయన చెప్పారు. ఇది సామాజిక సమానత్వానికి నాంది అని ఆయన తెలిపారు.హన్వాడ మండలంలోనే కాకుండా ఉమ్మడి జిల్లా లోనే గొప్ప సేవాలాల్ ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

గ్రామంలో అంతర్గత రహదారుల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చే యిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బీమిబాయి లింగమ్ నాయక్, ఉప సర్పంచ్ ఎన్ నరేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి. మహేందర్, కార్యనిర్వహక అధ్యక్షులు చెన్నయ్య, కార్పోరేటర్లు ఎం. ప్రవీణ్ కుమార్, ఎస్ శేఖర్, యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి,ఎస్ విజయ్ కుమార్, మండల తహశీల్దార్ కిష్య్టానాయక్ తదితరులు పాల్గొన్నారు.