అట్టహాసంగా కరాటే పోటీలు ప్రారంభం
జడ్చర్ల,మార్చి 1: స్పోరట్స్ కరాటే డు అకాడమీ ఆధ్వర్యంలో 6వ స్టేట్ ఇన్విట్సేషనల్ కరాటే ఛాంపియన్షిప్ -2026 జడ్చర్ల పట్టణంలో జీనాథ్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో చీఫ్ ఆర్గనైజర్ మూడవత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ నుంచి వివిధ జిల్లాల నుంచి సుమారు 500 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఇలాంటి కరాటే పోటీలు నిర్వహించడం వల్ల విద్యార్థిని విద్యార్థులు శారీరకంగా మా నసికంగా దృఢంగా తయారవుతారని పేర్కొన్నారు. నేటి సమాజంలో విద్యార్థులు అతి చిన్న వ యసులో డ్రగ్స్ కి,మద్యపానానికి బానిసలు అవుతున్నారన్నారు.
కరాటే నేర్చుకోవడం వల్ల ఉద యం లేవడం రాత్రి త్వరగా పడుకోవడం మంచి క్రమశిక్షణ మంచి అలవాట్లు వస్తాయని కరాటే మాస్టర్ శంకర్ నాయక్ తెలిపారు. ఈ కరాటే పోటీలను మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ జ్యోతి కృష్ణారెడ్డి,మాజీ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్,కౌన్సిలర్ చైతన్య చౌహాన్,మర్రి చెట్టు తాండ సర్పంచ్ రాములు నాయక్, మాజీ సర్పంచ్ బుక్క వెంకటేశం, సీనియర్ కాంగ్రెస్ లీడర్ అశోక్ యాదవ్, కరాటే మాస్టర్ రవికుమారు,జడ్చర్ల కరాటే మాస్టర్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.




