24 April, 2026 | 5:45 PM

ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలి

03-12-2024 12:50 AM

మిర్యాలగూడ  ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి 

నల్లగొండ, నవంబర్ 2 (విజయక్రాంతి): ఎత్తిపోతల పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశించారు. దామరచర్ల మండలంలో నిర్మిస్తున్న కొండ్రపోల్ ఎత్తిపోతల పథకం పనులను సోమవారం నీటిపారుదల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.

మూడేళ్లయినా పనులు పూ ర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ నిర్వాసితులకు పరిహారం ఎందుకు చెల్లించలేదని కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. వెంటనే బిల్లుల చెల్లింపులు జరిగేలా నీటి పా రుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడతానన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులపై పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పారు.