17 July, 2026 | 12:06 AM

గండిపేట జలాశయం గేట్లు ఎత్తివేత

27-09-2024 01:35 PM

రాజేంద్రనగర్, విజయక్రాంతి: ఎగువ ప్రాంతాల నుంచి గండిపేట జ‌లాశ‌యనికి వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతోంది. దీంతో ఈ జ‌లాశ‌యం మ‌రో రెండు గేట్ల‌ను అధికారులు ఎత్తారు. శుక్రవారం ఉద‌యం 10 గంట‌ల‌కు రెండు గేట్ల‌ను ఒక అడుగు మేర ఎత్తి 242 క్యూసెక్కుల నీటిని కిందికి వ‌దులుతున్నారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 4 గేట్ల ద్వారా 484 క్యూసెక్కుల వ‌ర‌ద నీరు విడుద‌ల చేస్తున్నారు. అటు హిమాయ‌త్ సాగ‌ర్ జ‌లాశ‌యం ఒక గేటు ద్వారా 348 క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేస్తున్నారు. కాగా హిమాయ‌త్ సాగ‌ర్ కు 500 క్యూసెక్కులు, ఉస్మాన్ సాగ‌ర్ కు క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొన‌సాగుతోంది.