6 June, 2026 | 10:29 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

కరిగిన విదేశీ మారక నిల్వలు

03-08-2024 12:05 AM

ముంబై, ఆగస్టు 2 : కొద్ది వారాలపాటు పెరుగుతూ వస్తున్న విదేశీ మారక నిల్వలు జూలై 26తో ముగిసిన వారంలో ఒక్కసారిగా తగ్గాయి. శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూలై 26తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు 3.471 బిలియన్ డాలర్లు తగ్గి 667.386 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అంతక్రితం వారంలో ఇవి 4.007 బిలియన్ డాలర్ల మేర  పెరిగి రికార్డు గరిష్ఠస్థాయి 670.857 బిలియన్ డాలర్లకు చేరాయి. 

తాజాగా జూలై 26తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.171 బిలియన్ డాలర్లు తగ్గి 586.877 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.  అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు. 

బంగారం నిల్వలూ తగ్గాయ్

దేశం వద్దనున్న బంగారం నిల్వలు కూడా సమీక్షావారంలో  2.297 బిలియన్ డాలర్లు మేర తగ్గి 57.695 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి.  స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 5 మిలియన్ డాలర్లు తగ్గి18.202 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు 2 మిలియన్ డాలర్లు  పెరిగి 4.612 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.