27 July, 2026 | 7:53 PM

Breaking News

తరుగు పేరుతో రూ.71 లక్షల అవినీతి   •   మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •  

లిక్కర్ వ్యాన్ బోల్తా.. మద్యం సీసాల కోసం ఎగబడ్డ జనం

06-06-2026 01:23 PM

బసిరెడ్డిపల్లి: చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లె సమీపంలో శనివారం మద్యం లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. దీంతో స్థానికులు అక్కడికి పరుగులు తీసి మద్యం సీసాలను ఎత్తుకుపోవడంతో గందరగోళం నెలకొంది. మహిళలతో సహా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి, మద్యం సీసాలను సేకరించి లుంగీలు, తువ్వాళ్లు, సంచులలో వాటిని తరలించుకుపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అధికారులు అక్కడికి చేరుకునే లోపు ఈ ఘటన ఆ ప్రాంతంలో కాసేపు కలకలం సృష్టించింది. మగాళ్లతో సమానంగా మహిళలు మందు బాటిల్లు ఎత్తుకెళ్లడం విశేషం. వాహనంలో సుమారు పది లక్షల విలువ చేసే మద్యం ఉన్నట్లు డ్రైవర్ తెలిపాడు.