లీసా ముగిం చారు!
ఓం సాయిరామ్ ఆర్ట్స్(Om Sai Ram Arts), ఐరాస్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై వెంకట్ దుగ్గిరెడ్డి(Venkat Duggireddy), రామకృష్ణ ఐల(Ramakrishna Aila) సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లీసా’(Lisa). విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనన్య నాగళ్ల(Ananya Nagalla) ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. జవహర్ పవార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవలే ‘లీసా’ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది.
భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రాని విధంగా రెండు భిన్నమైన జోనర్లను సరికొత్త పద్ధతిలో మేళవించి ఈ కథను రూపొందించారు. సినిమాటోగ్రాఫర్ సతీశ్ రెడ్డి మాసం ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు స్క్రీన్‌ప్లే సమకూర్చి, సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ‘ఎస్సార్ కళ్యాణమండపం’ దర్శకుడు శ్రీధర్ గాదె ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిచడానికి సుముఖంగా ఉన్నారు.






