దోష తింటుండగా సాంబార్ లో కనిపించిన బల్లి
07-07-2026 08:14 PM
* హోటల్ యజమాని నిర్లక్య సమాధానంతో పోలీసులకు ఫోన్ చేసిన కస్టమర్...
ఆదిలాబాద్,(విజయక్రాంతి): హోటల్లో దోశ తింటున్న ఓ కస్టమర్ కు సాంబారులో బల్లి కనబడటంతో షాక్ కు గురయ్యాడు. మావల మండలం దుబ్బగూడకు చెందిన రాజేశ్ తన బావమరిదితో కలిసి ఆదిలాబాద్ లోని మహేశ్వరి టాకీస్ సమీపంలో గల బాదం జ్యూస్ బార్ హోటల్ లో మంగళవారం టిఫిన్ చేయడానికి వచ్చాడు. దోశ ఆర్డర్ చేసి తింటుండగా సాంబార్ లో ఒక్కసారిగా బల్లి కనిపించింది. భయాందోళనకు గురైన కస్టమర్ హోటల్ యజమానిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా బదులిచ్చాడని సదరు కస్టమర్ రాజేష్ పేర్కొన్నారు. దీంతో పోలీసులకు, ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేయాగా, ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు విచారణ చేపడుతున్నారన్నారు.






