చెత్త ఆర్పీలు!

11-09-2026 | 05:30am
  1. పాలమూరు పట్టణ మెప్మాలో ఆరుగురిదే రాజ్యం 
  2. మహిళల పేరున చెత్త సేకరణ ట్రాక్టర్లు..
  3. ఆదాయం మాత్రం ఆరుగురు రిసోర్స్ పర్సన్లకు! 
  4. ప్రతి మూడు నెలలకోసారి ఒక్కొక్కరి ఖాతాలోకి 3.51 లక్షలు 
  5. మూడేళ్లుగా లక్షల రూపాయలు దోపిడీ

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): మహిళల్ని కోటీశ్వరులుగా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) అనేక ఆదాయ వనరులు వచ్చే పథకాలను ప్రవేశపెట్టింది. వాటిని మహిళలే నిర్వహించుకొని వచ్చే ఆ దాయాన్ని సంఘంలోని సభ్యులంతా సమానంగా పంచుకో వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే పాలమూర్ పట్టణ మెప్మా(Palamuru Town MEPMA)లో మహిళలకు కేటాయించిన ఆరు చెత్త సేకరణ ట్రాక్టర్ల(Garbage collection tractors)పై ఆరుగురు రిసోర్స్ పర్సన్(Resource Person) (ఆర్పీలు) పెత్తనం చెలాయిస్తూ వాటిపై మ హిళల పేరున వచ్చే ఆదాయాన్ని దండుకుంటున్నారు.

మహిళా సంఘాలకు(Women groups) సమానంగా పంచాల్సిన సొమ్మును ఆ ఆరుగురు ఆర్పీలే నేరుగా తమ ఖాతాలో వేసుకొంటున్నారు. ఒక్కొక్కరు ప్రతి మూడు నెలలకోసారి అక్షరాల రూ.3.51 లక్షలు కాజేస్తున్నారు. ఇలా మూడేళ్లుగా లక్షల రూపాయలు దోపిడీకి పాల్పడుతున్నా రు. ప్రతి ఆర్పీకి ప్రభుత్వం నెలకు రూ.6 వేలు గౌరవ వేతనం ఇస్తుంటే.. ఈ ఆరుగురు ఆర్పీలు మాత్రం లక్షల్లో సమకూ ర్చుకొంటున్నారు. మెప్మాలోని 96 మంది ఆర్పీలు నోరుమెదపకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే వారి వెనుకుండి ఇదంతా నడిపిస్తున్నదిఒక బాస్ అని తెలుస్తున్నది.

ఆయన సూచనల మేర కే వీరు నడుచుకుంటున్నారని, వీరు దోచుకుంటున్న సొమ్ములో ఆ బాస్‌కూ వాటా వెళ్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని రాజేంద్రనగర్ పరస్పర మహిళా సమైఖ్య(Rajendranagar Mutual Women Federation)కు చెందిన కొంత మంది మహిళలు వారు తీసుకొన్న డబ్బుల నివేదికను తీసుకొచ్చి విజయక్రాంతి అందజేసి ఆవేదనను వ్యక్తం చేశారు. పాలమూర్ కార్పొరేషన్ పరిధిలోని మెప్మాలో ఆ బాస్ లీలలు ఒక్కొ క్క టిగా బయటకు వస్తున్నాయి. మహబూబ్‌నగర్ పట్టణంలో 60 డివిజన్లకు గాను వందకు పైగా స్లమ్ లెవల్ ఫెడరేషన్లుండగా, వీటిలో 3,187మహిళా సంఘాలున్నాయి.

ఈ సంఘాల్లో 31,487మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరిని కలిపి రెండు పట్టణ మహిళా సమాఖ్యలుగా ఏర్పాటు చేశారు. ఒకటి పట్టణానికి, రెండోది విలీన గ్రామాలను కలిపి ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తన సొంత నిధులతో ప్రత్యేక శిక్షణలు ఏర్పాటు చేసి, వారికి ఉపాది అవకాశాల్ని కల్పిస్తున్నారు. ఎమ్మెల్యే ఆశయాలకు అనుగుణంగానే కార్పొరేషన్ మేయర్ గుమ్మాల్ మమత, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్‌రెడ్డి రాణిస్తున్నారు. వీరి ఆశయాలను కొంత మంది దుర్మార్గంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. 

6 ట్రాక్టర్ల కేటాయింపు నుంచే..

ఆదాయ వనరులను సమకూర్చడంలో భాగంగా మున్సిపల్ శాఖ తమ వంతు సహకారాన్ని అందించేందుకు గాను చెత్త సేకరించే 6 ట్రాక్టర్ల నిర్వహణ మహిళలకు అప్పగించింది. ఈ ట్రాక్టర్లను మున్సిపల్ శాఖ ప్రారంభంలో నవభారతి పట్టణ సమాఖ్యకు కేటాయించింది. కానీ ఈ సమాఖ్యలో ఆరుగురు ఆర్పీలు ఒక కోటరీగా ఏర్పడి ఆదాయాన్ని బయటకు రానివ్వకుండా వారే దండుకొన్నారు. ఈ సమాఖ్య లో ఉంటే తమ ఆటలు సాగవని భావించిన ఆ ఆరుగురు ఆర్పీలు ఏకంగా నవభారతి పట్టణ సమాఖ్యకు కేటాయించిన ట్రాక్టర్లను రాజేంద్రనగర్ పరస్పర సహకార సంఘానికి కేటాయించుకున్నారు.

ఇది వారి బాస్ ద్వారానే జరిగింద నే ఆరోపణులున్నాయి. ఇదేమని తోటి ఆర్పీలు కానీ, మహిళలు కానీ ఎవ్వరైనా అడిగితే వారిపై నానా రకాల కుట్రలు చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. తెర వెనుక ఉన్నది మాత్రం ఆ బాసేనట. ఎందుకంటే వారికి ఈ ఆలోచన చెప్పింది, వారిచే చేయించింది ఇతనేనని తోటి ఆర్పీలు, మహిళలే చెపుతున్నారు. 

మూడేళ్లుగా లక్షల్లో దోపిడీ

మున్సిపల్ శాఖ ట్రాక్టర్ల నిర్వహణ కోసం ప్రతి నెల ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1.17 లక్షలు కేటాయిస్తుంది. ఒక్కో ట్రాక్టర్‌పై నిర్వహణ ఖర్చు నెలకు రూ.60 వేల వరకు అవుతోంది. ఒక్కో ట్రాక్టర్‌పై మహిళలకు నెలకు రూ.60 వేల వరకు మిగులుతోంది. ఇలా ఆరు ట్రాక్టర్ల మీద ఖర్చులు పోను ప్రతి నెల రూ.3.60 లక్షల వరకు ఆదాయం మిగులుతోంది. వీటిని మహిళా సంఘాలకు సమానంగా పంచాలి. కానీ యథేచ్చగా ఆ ఆరుగురు ఆర్పీలే నేరుగా తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ప్రతి మూడు నెలలకోసారి రూ.3.51 లక్షల చొప్పున కాజేశారు. ఇలా మూడేళ్లుగా లక్షల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారు. మహిళలు ఎవరైనా అడిగేందుకు సాహసిస్తే వారిపై విరుచుకుపడి, బెదిరింపులకు దిగుతున్నారని తెలిసింది.

అసలు ఆర్పీల బాధ్యత ఏమిటీ?

ప్రభుత్వం నెలకు ఆర్పీలకు ఇచ్చే గౌరవ వేతనం రూ.6 వేలు. రిసోర్స్ పర్సన్ అంటే మహిళలకు అవగాహన కల్పించి ప్రభుత్వ పథకాలను సద్వినియోగ పర్చుకొని ఆర్థికంగా రాణించేలా కృషి చేయాలి. ప్రభుత్వం గౌరవ వేతనం తీసుకొనే ఆర్పీలు ఏ ప్రభుత్వం పరిధిలో ఏ వ్యాపారం చెయ్యకూడదు. ఈ ఆరుగురు ఆర్పీలు మాత్రం ఏ నిబంధనను పట్టించుకోరు. వారి నిబంధననే తోటి ఆర్పీలపై అమలు చేస్తున్నారు. ఆ ఆరుగురు ఒక్కొక్కరు ఐదారు ప్రభుత్వ రంగ సంస్థల్లో వివిధ పనులు చేజిక్కించుకొని.. మెప్మాను తమ కబంధ హస్తాల్లోకి తీసుకున్నారని తోటి ఆర్పీలతోపాటు, మహిళలు చెపుతున్నారు. మహిళా సంఘాల సభ్యులకు మాయమాటలు చెపుతూ మహిళలందరికి ఆ పనుల నుంచి వచ్చే లబ్ధికి అడ్డుపడుతూ నడిపిస్తున్నారట. ఇటీవల ఒక ఆర్పీని కూడా దూరంగా పెట్టినట్లు తెలుస్తున్నది.

96 మంది ఆర్పీలపై వారిదే పెత్తనం

ఒక కోటరీగా ఏర్పడిన ఆ ఆరుగురు ఆర్పీల పెత్తనం అంతా ఇంత కాదు. తమ ఆదాయాన్ని గుర్తించి మమ్మల్ని ఎక్కడ ప్రశ్నిస్తారోనని మిగిలిన 96 మంది ఆర్పీలపై పెత్తనం చెలాయిస్తూ.. నోరు పెద్దగా చేసి వారిని భయబ్రాంతులకు గురిచేస్తారట. వీరిని కనిపించని బాసే నానా రకాలుగా అవమానాలు, ఇబ్బందులకు గురిచేయిస్తారట. అక్కడితో ఆగకుండా కలెక్టర్ కానీ, ఎమ్మెల్యే కానీ మున్సిపల్ కమిషనర్, మెప్మా పీడీలు సైతం మేము చెప్పిందే వింటారని వారిని భయపెడతారట. ఎందుకంటే వారి ముందు వీరిదే పై చెయ్యి ఉంటోందని, వీరిని కాకుండా మేము ముందుకు వెళ్లి మా బాధను చెప్పుకోలేమని ఆర్పీలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. చేసేది లేక ఆ ఆరుగురు ఆర్పీలతోపాటు, వారి వెనుకున్న బాస్ చెప్పింది వినుకుంటూ వస్తున్నారని తెలుస్తోంది. 

మహిళల ఓట్ల పేరునా దోపిడీ

ఇక ఎన్నికల సమయంలో అయితే ఈ ఆరుగురు ఆర్పీలు 31487 మంది మహిళలు మా చేతుల్లో ఉన్నారు, వారంతా మేము చెప్పిందే వింటారు ఎవ్వరికి ఓటు వెయ్యమంటే వారికి వేస్తారని బరిలో ఉండే నేతలకు చెప్పి దొరికిన కాడికి దోచుకుంటారట. 

వెనకుండి నడిపిస్తున్న ఆ బాస్ ఎవరు?

ఒక్క పైసా పెట్టుబడి లేకుండా దండుకుంటున్న ఆ ఆరుగురి ఆర్పీల వ్యవహారం వెనుక ఉన్నది ఆబాసేననే ఆరోపణ. మెప్మాలో మహిళల నోట్లో మట్టి కొట్టి నెలకు లక్షలు కాజేస్తున్న వ్యవహారాన్ని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డికి తెలియకుండా నడిపిస్తున్నదెవరని చర్చనీయాంశంగా మారింది. అవినీతిని సహించని ఎమ్మెల్యేను పక్కదారి పట్టిస్తున్నారంటే వీరి నెట్‌వర్క్ ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతోంది. ఈ ఆరుగురి ఆర్పీల వెనుకున్న బాస్‌పై కఠినచర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు.

తప్పును ఉపేక్షించేది లేదు

ఆర్పీలు ఎట్టి పరిస్థితుల్లో మహిళలకు పూర్తిస్థాయిలో ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలి. ట్రాక్టర్‌ల విషయంలో ఆర్పీల చేతివాటం ఉన్నదని తెలిస్తే ఉపేక్షించేది లేదు. నగర సమాఖ్య ఖాతా నుంచి నేరుగా మహిళా సంఘాల ఖాతాలకు నిధులు తరలింపు జరగాలి. అలా కాకుండా వ్యక్తిగతంగా జరిగిన ట్లు తేలితే వారిపై చర్యలు తీసుకుంటాం. నగర మహిళలందరికీ మేలు జరిగేలా చూస్తాం.

 రామాంజులరెడ్డి, నగర కమిషనర్, మహబూబ్‌నగర్ 

మరిన్ని వార్తలు