6 July, 2026 | 1:28 AM

టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ పరీక్షలో రాష్ట్ర మొదటి ర్యాంక్ సాధించిన మహిత

06-07-2026 12:29 AM

ఎల్లారెడ్డిపేట జూలై 5(విజయ క్రాంతి):ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఆదర్శ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థిని కూరటి మహిత ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ లో 200 మార్కులకు 191 మార్కులతో రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించింది. ఈ సంవత్సరం జనవరిలో రాష్ట్ర టెక్నికల్ బోర్డు నిర్వహించిన టైప్ రైటింగ్ పరీక్షలలో మహిత సిరిసిల్లలోని అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో ఆదర్శ టైప్ రైటింగ్ ఇనిస్ట్యూట్ లో శిక్షణ పొంది పరీక్ష రాయడం జరిగింది. టెక్నికల్ బోర్డు ఆదివారం టైప్ లో ఉత్తీర్ణులైన వారి ర్యాంకులను ప్రకటించడం జరిగింది.ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ స్పీడ్ లో 100 మార్కులకు గాను 96, సెకండ్ పేపర్లో 100 మార్కులకు 95 మార్కులు సాధించింది.

ఈ సందర్భంగా మహిత మాట్లాడుతూ ఆదర్శ టైప్ రైటింగ్ ఇనిస్ట్యూట్ ప్రిన్సిపాల్ మజీద్, డైరెక్టర్ వాజిద్ ప్రోత్సాహంతో,వారి శిక్షణతో ఈ ర్యాంకును సాధించడం ఆనందంగా ఉందన్నారు. టైప్ రైటింగ్ నేర్చుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని, ప్రభుత్వ, ప్రైవేట్ లెటర్లు, జీవో, మెమో, బ్యాంకు, ఫైనాన్స్ లకు సంబంధించిన స్టేట్మెంట్లు, ఇన్వైస్, డెబిట్, అకౌంట్ సేల్స్, క్రెడిట్ నోట్, బ్యాలెన్స్ షీట్,కోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్ లాంటివి నేర్చుకోవచ్చు అన్నారు.

ఇంగ్లీషులో కూడా మంచి ప్రావీణ్యం పొంది, కంప్యూటర్ లో గంటలో చేసే పనిని టైప్ పాస్ అయితే 20 నిమిషాలలో పూర్తి చేయవచ్చన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు టైప్ రైటింగ్ ఎంతో ముఖ్యమైందని తెలిపారు. ఆదర్శ టైప్ రైటింగ్ ఇనిస్ట్యూట్ ప్రిన్సిపాల్ మజీద్, డైరెక్టర్ వాజిద్, ఇనిస్ట్యూట్ సిబ్బంది, తోటి విద్యార్థులు మహితను అభినందించారు.