21-02-2026 09:19:35 PM
భైంసా,(విజయక్రాంతి): ఈనెల 26న ముధోల్ మండల కేంద్రంలో వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం మండలంలోని అజ్గుల్ వట్టోలి, సుంకిలి లంబాకి పెద్ద గ్రామాల్లో పర్యటించి పెద్ద ఎత్తున ప్రజలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శంకర్ పటేల్ సాయినాథ్ పటేల్ గంగాధర్ పటేల్ పండరి పటేల్ వినోద్ పటేల్, దేవదాస్ పటేల్ భూషణ్ పటేల్ తదితరులు ఉన్నారు.