12 July, 2026 | 6:07 PM

Breaking News

ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ను సందర్శించిన డివైఎస్ఓ సురేష్   •   వాహనదారులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ పేపర్లు, లైసెన్సులు కలిగి ఉండాలి   •   జాడ లేని వానలు... ఎండుతున్న పంటలు..   •   కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి   •   ఎమ్మార్పీఎస్ కరపత్రాలు ఆవిష్కరణ   •   సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యం   •   పీఎఫ్ ఉన్న ప్రతి బీడీ కార్మికురాలికి ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి   •   పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •  

సీపీఎం బలపర్చిన అభ్యర్థులను గెలిపించండి : తుమ్మల వీరారెడ్డి

29-11-2025 12:20 AM

 నకిరేకల్, నవంబర్28 (విజయ క్రాంతి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సిపిఎం, బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి కోరారు.శుక్రవారం నకిరేకల్ నర్రా రాఘవరెడ్డి భవనంలో నిర్వహించిన సిపిఎం మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలిచే వారికి ప్రజలు ఆశీర్వాదం ఇవ్వాలని, ధనబలం కాదు ప్రజాబలం ముఖ్యమని అన్నారు.

అభివృద్ధి,సంక్షేమ పనుల కోసం పోరాడే కమ్యూనిస్టు కార్యకర్తలను ఎన్నుకోవడం ద్వారా గ్రామాల అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు.ఎన్నికల్లో ఓటర్లు ప్రలోభాలకు లోనుకాకుండా, ప్రజల కోసం పనిచేసే మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని ఆయన అభిలషించారు.ఈసమావేశంలో  ఆపార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల, మండల కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, టౌన్ కార్యదర్శి ఒంటెపాక వెంకటేశ్వర్లు, మండల కమిటీ సభ్యులు ఆకుల భాస్కర్, చాకుంట్ల నరసింహ, చిన్నబోయిన నాగమణి, అక్కెనపల్లి సైదులు, ఒంటెపాక కృష్ణ, కొప్పుల అంజయ్య, లక్ష్మీ, నరసయ్య, జిల్లా ఉపేందర్, పాలడుగు పరమేష్, బండమీది ఎల్లయ్య, వెంకట రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.