22 August, 2026 | 6:58 PM

ఐటీడీఏ ముట్టడిని విజయవంతం చేయండి.

22-08-2026 05:52 PM

బోథ్. ఆగస్టు 22 (విజయక్రాంతి): ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న నిర్వహించిన ఐటీడీఏ ముట్టడిని విజయవంతం చేయాలని ఆదివాసీ పోరాట సమితి సోనాల మండల కమిటీ అధ్యక్షులు జుగునక్ మారుతి ఉపాధ్యక్షులు రాయచడం జాకేసులు పిలుపునిచ్చారు. చట్టబద్ధతలేని లంబాడాలని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని అందుకు కమిషన్ నియమించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో  1/70 ప్రసాద్ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, పోలీసు ఉద్యోగాలలో 70% రిజర్వేషన్ ఆదివాసులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలు సాగు చేస్తున్న అటవీ భూముల హక్కు పత్రాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బంద్ కు సంబంధించిన వాల్ పోస్టర్లు విడుదల చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కడప నగేష్, మేశ్రం భూమన్న, మేడితుడసం లక్ష్మణ్, సోయం బాపూరావు, గంగాధర్, కిషన్ కోవా, మిశ్రమ లాలురం, ఆత్రం శంకర్, మండల ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.