కొండ కోన కోరసు పాడే..

26-09-2026 | 05:05am

జానపద గాయని ‘గరివిడి లక్ష్మి’ కథను వెండితెరపైకి తీసుకొస్తోంది ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ‘గరివిడి లక్ష్మి’ పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో టైటిల్‌లో రోల్‌ను ఆనంది పోషిస్తోంది. గౌరి నాయుడు జమ్ము(Gowri Naidu Jammu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నరేశ్, రాశి, శరణ్య ప్రదీప్, అంకిత్ కొయ్య, మీసాల లక్ష్మణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన వచ్చింది. అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘కొండ కోన కోరసు పాడే’ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ స్వయంగా సాహిత్యం అందించి స్వరపర్చిన పాట ఇది. అనన్య భట్, చరణ్ అర్జున్ పాడిన ఈ గీత సాహిత్యం సంగీత ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జే ఆదిత్య; సంగీతం: చరణ్ అర్జున్.

మరిన్ని వార్తలు