15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మాలి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

27-02-2026 04:39 PM

కాగజ్‌నగర్,(విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్సీ దండె విఠల్‌ను రాష్ట్ర మాలి సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాలి కులస్తులను ఎస్టీ (షెడ్యూల్డ్ ట్రైబ్స్) జాబితాలో చేర్చాలని కోరుతూ, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్‌రావు ఎమ్మెల్సీకి వినతిపత్రాన్ని అందజేశారు.

మాలి కులస్తులు తరతరాలుగా సామాజిక, ఆర్థిక వెనుకబాటుతో జీవిస్తున్నారని, విద్య, ఉపాధి, సంక్షేమ పథకాల్లో తగిన అవకాశాలు దక్కడం లేదని ప్రతినిధులు వివరించారు. ఈ నేపథ్యంలో ఎస్టీ హోదా కల్పిస్తే మాలి కులస్తులకు సమగ్ర అభివృద్ధికి మార్గం సుగమమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. అలాగే, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మాలి కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ విజ్ఞప్తిపై స్పందించిన ఎమ్మెల్సీ దండె విఠల్, మాలి కులస్తుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, సంబంధిత శాఖలతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాలి సంఘం చేస్తున్న ఉద్యమం సమంజసమైందని పేర్కొంటూ, ప్రజాప్రతినిధులుగా తగిన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలి సంఘం నాయకులు, స్థానిక ప్రతినిధులు, మాలి కులస్తులు  పాల్గొన్నారు.