30 June, 2026 | 4:10 PM

వీడి కంపెనీ తరలింపు నిలిపివేయాలి

30-06-2026 03:37 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో ఉన్న దేశాయి కంపెనీ తరలింపును విరమించుకోవాలని బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పసుపుమటి చిన్నయ్య పేర్కొన్నారు. ఈ విషయమై వీడి కంపెనీలో పని చేసే కార్మికులు గ్రామ కమిటీ అధ్యక్షునికి వినతి పత్రం అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులు కంపెనీ తరలిపోతే తాము ఉపాధి కోల్పోతామని వాపోయారు.

కంపెనీ తరలిపోకుండా తాము స్థానిక శాసనసభ్యులు. జాదవ్ అనిల్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ దృష్టికి తీసుకు వస్తామన్నారు.కంపెనీ ఇతర ప్రాంతాలకు తరలిపోవడం వల్ల స్థానికంగా కూలీలు ఉపాధి కోల్పోతారని వారు వాపోయారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లంక లలిత ఉపసర్పంచ్ తుల శ్రీకాంత్ ఈర్ల అభిలాష్ రమేష్ గాజుల సుగుణాకర్ శరత్ తుల హరీష్ తదితరులు పాల్గొన్నారు.