30 June, 2026 | 5:14 PM

కళాశాలలో సీటును ధ్రువీకరించుకోవాలి

30-06-2026 04:39 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడు విడుదల్లో నిర్వహించిన దోస్త్ అప్లికేషన్లో సీట్లు పొందిన విద్యార్థులు జులై 4న కళాశాల అడ్మిషన్ ధృవీకరించుకోవాలని ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. దోస్త్ అప్లికేషన్ ద్వారా ఇప్పటివరకు సీట్లు పొందిన విద్యార్థులు జూలై 4న కళాశాలకు అన్ని ధ్రువీకరణ పత్రలతో ఉదయం 9 గంటలకు హాజరు కావలసి ఉంటుందన్నారు. ఇంటర్ పదవ తరగతి కులం నివాసం మూడో ఫైట్ ఆధార్ కార్డు సెట్ తో రావాలన్నారు. దోస్త్ అలాట్మెంట్ లెటర్, హెల్త్ సేలుకు రిపోర్ట్ ఫోటోలు కూడా తెచ్చుకోవాలన్నారు. సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వారికి మాత్రమే డిగ్రీ కళాశాలలో 2026 27 సంవత్సరం కాను అడ్మిషన్ ఉంటుందని విద్యార్థులు ఈ అవకాశం తీసుకోవాలన్నారు.