calender_icon.png 11 September, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిప్యూటీ సీఎంని కలిసిన మాలి మహా సంఘం నేతలు

10-02-2025 03:52:43 PM

ఆదిలాబాద్, (విజయక్రాంతి): అఖిల భారతీయ మాలి మహా సంఘం జాతీయ, రాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నేతలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సోమవారం కలిశారు. హైదరాబాదులోని మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో పూలే దంపతుల వారసత్వం కలిగిన మాలి కులస్తులు, సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే(State Mali Association President  Sukumar Petkule) నేతృత్వంలో 21 మంది నేతల బృందం సోమవారం కలిసి మహాత్మ జ్యోతిరావు పూలే తలపాగ, కండువా, పూలే సమగ్ర వాంగ్మయ గ్రంథాన్ని డిప్యూటీ సీఎం కు బహుకరించి ఘనంగా సన్మానించారు.

11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ సీఎంకి సమర్పించి, వాటిని పరిష్కరించాలని కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం మాలీల ఎస్టి హోదా అంశం తో పాటు మిగతా అంశాలను పరిష్కరించేలా కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే మాట్లాడుతూ జనవరి 3న జరిగే సావిత్రిబాయి పూలే జయంతి రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించి ఘనంగా జరుపుకున్నందుకు,  ప్రగతి భవన్ ను మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజాభవనం గా నామకరణం చేసినందుకు ఫూలే వారసులు మహారాష్ట్ర కు చెందిన దిలీప్ గణపతి నేవసే సర్, జాతీయ అధ్యక్షులు విలాసరావు ఉన్నారు.